Leopard in Eluru: పోలవరం ప్రాజెక్టు సమీపంలో చిరుతపులి సంచారం.. వీడియో వైరల్ - ap viral news
Leopard Roaming at Polavaram Project: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఈ తెల్లవారుజామున పోలవరం ప్రాజెక్టు కార్మికులకు.. 902 కొండ ప్రాంతంలో గోదావరిలోకి మంచినీటి కోసం వెళుతున్న చిరుతపులి కనిపించడంతో ప్రాజెక్టు కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అటవీ శాఖ అధికారులు చిరుత పులి సంచరించిన ప్రాంతానికి వెళ్లి పాదముద్రలు పరిశీలించి.. వాటిని సేకరించారు. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి చిరుత దారి మళ్లి.. ప్రాజెక్టు వైపు వచ్చి ఉంటుందని వారు భావిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు కార్మికులు బహిర్భూమికి బయటకు వెళ్లడం, సరదాగా అడవుల్లో సంచరించడం చేయరాదని, చికెన్ వ్యర్థాలు, ఇతర మాంసాహార పదార్థాలు బహిరంగ ప్రదేశాల్లో పడవేయరాదని, అడవుల్లో కట్టేలు కొట్టుకునే వారు కలప కోసం వెళ్లేవారు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో సంచరించరాదని అటవీ క్షేత్రాధికారి దావీదు రాజు హెచ్చరించారు. అలాగే అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు.