ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్

ETV Bharat / videos

Viveka's murder case: అవినాష్​ను అదుపులోకి తీసుకునేందుకు న్యాయపరమైన అడ్డంకులు లేవు: శ్రావణ్ కుమార్ - వివేకా హత్య కేసు

By

Published : May 22, 2023, 4:29 PM IST

CBI investigation in Viveka's murder case : వివేకా హత్య కేసులో ఇప్పటివరకు 8 సార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. అన్నిసార్లు కూడా తనను అరెస్టు చేస్తారేమోనని భావించిన ఆయన ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. అయితే, వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. పలు విషయాల్లో వెనకడుగు వేస్తోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు విచారించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని పేర్కొంటున్నారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అంశంలో సీబీఐ తాత్సారం చేస్తోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అవినాష్ రెడ్డి తాజాగా దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకోలేదు.. దీంతో న్యాయపరమైన అడ్డంకులు సీబీఐకి లేవన్నారు. ఓ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసేందుకు ఎందుకు అలసత్వం వహిస్తుందోనని న్యాయవాది పేర్కొన్నారు. సామాన్యుడికైనా, వీఐపీలకైనా చట్టం ఒకేలా అమలు చేయాలని చెబుతున్న హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్​తో మాప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details