Laxman Reddy Comments on Veligonda Project: ప్రాజెక్టులకు నిధులు కేటాయించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం: లక్ష్మణరెడ్డి - andhra pradesh irrigation projects
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2023, 5:31 PM IST
Laxman Reddy Comments On Veligonda Project : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయితేనే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుందని జన చైతన్య వేదిక రాష్ట్రఅధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించటంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆక్షేపించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కరవు ప్రాంతాలకు సాగునీరందించే వెలిగొండ వంటి ముఖ్యమైన ప్రాజెక్టుకు నిధులు సరిగా కేటాయించటం లేదని ఆరోపించారు. గత నాలుగేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టులకోసం రాష్ట్ర బడ్జెట్లలో 44 వేల 500 కోట్లు కేటాయించినా... 20 వేల 7 వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తే అంతకన్నా మించిన సంక్షేమ కార్యక్రమం మరొకటి ఉండదన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరు ఏకతాటి పైకి వచ్చి వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి కోసం కృషి చేయాలని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. లక్షల కోట్ల సంపద సృష్టించబడుతుందని అయన అన్నారు.