ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lawyers_Agitation_Against_512_GO_in_AP

ETV Bharat / videos

భూ హక్కుల చట్టం రద్దు చేయాలంటూ రోడ్డెక్కిన న్యాయవాదులు - ప్రభుత్వంపై ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 12:13 PM IST

Lawyers Agitation Against 512 GO in AP: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఇప్పటికే న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు సైతం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం భూ యాజమాన్య హక్కులను కాలరాస్తోందని మండిపడుతున్నారు. జీవో 512ను రద్దు చేయాలంటూ ఆందోళను చేపడుతున్నారు. ప్రజల హక్కులను హరించే విధంగా జీవో ఉందని, ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ యాజమాన్య హక్కులను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలంటూ కోరుతున్నారు. న్యాయస్థానాలకు ఉన్న అధికారాలను రెవెన్యూ అధికారులకు బదలాయించడం వల్ల బాధితులకు సరైన న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా నెల్లూరులో కూడా న్యాయవాదులు రోడ్డెక్కారు. బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకురావొద్దంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రజల హక్కులను హరించే ఈ చట్టంని వ్యతిరేకిస్తున్నామని మండిపడ్డారు. భూ హక్కుల చట్టం 27/2023ను (Land Rights Act 27/2023 Andhra Pradesh) రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details