ఆంధ్రప్రదేశ్

andhra pradesh

buddhist_territory_land_adjourned_for_8_weeks_in_high_court

ETV Bharat / videos

చరిత్రాత్మక భూముల పరిధి తేల్చాలని పిల్ దాఖలు - విచారణ 8 వారాలకు వాయిదా - హైకోర్టు ప్రధాన వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 10:37 AM IST

Buddhist Territory Land Adjourned For 8 Weeks In High Court: విశాఖ జిల్లా భీమునిపట్నం మండల పరిధిలోని ఉన్న తొట్లకొండపై ప్రఖ్యాత బౌద్ధ క్షేత్ర విస్తీర్ణ పరిధిని తేల్చేందుకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బౌద్ధ క్షేత్రానికి చెందిన భూములను డీనోటిఫై (DeNotify)చేసి వేల ఎకరాల భూములను క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి చరిత్రాత్మక బౌద్ధ అనవాళ్లున్నాయో లేదో తేల్చి భారత పురావస్తు శాఖ(ఆర్కియాలిజికల్‌) సర్వే డైరెక్టర్‌ జనరల్‌ను నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. 

తొట్లకొండపై ఉన్న ప్రఖ్యాత బౌద్ధ క్షేత్ర విస్తీర్ణ పరిధిని కుదిస్తూ 2021 జులై 31న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 131ని సవాలు చేస్తూ ఈమని లక్ష్మీశర్మ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించారు. శాస్త్రీయ అధ్యయనం చేయకుండా వేల ఎకరాలున్న క్షేత్ర పరిధిని తగ్గించారన్నారు. కేవలం 120 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోందని  మూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో డీనోటిఫై చేసిన భూమిలో బౌద్ధ క్షేత్ర చరిత్రాత్మక ఆనవాళ్లను తేల్చాలని హైకోర్టును కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. 

ABOUT THE AUTHOR

...view details