KVPS General Secretary Exclusive Interview 2023 : 'సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్ర చేసే అర్హత వైసీపీకి ఉందా?' - విజయవాడ తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 12:56 PM IST
KVPS General Secretary Exclusive Interview 2023 : నాలుగున్నరేళ్లుగా ఎస్టీ, ఎస్టీ, బీసీలను దారుణంగా వంచించిన వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికారత పేరుతో బస్సు యాత్రతో మరో నాటకానికి తెరతీసిందని కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు, దౌర్జన్యాలు, దాష్టీకాలకు తెగబడటం తప్పితే. వారి మంచి కోసం ఏం చేశారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. బస్సు యాత్ర చేసేందుకు వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి అర్హత లేనేలేదంటున్న ఆండ్ర మాల్యాద్రితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Andra Malyadri Fires on YCP Government : నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే బూటకపు నినాదం చేస్తూ... వారి సబ్‌ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించిందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మండిపడ్డారు. దళితుల భూములను ప్రభుత్వ అవసరాలకు లాగేసుకున్నారని, ఎసైన్డ్ భూములను పెద్దలకు కట్టబెట్టేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు 27 సంక్షేమ పథకాలను దూరం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులను దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల్ని హత్యలు చేయండి.. అండగా ఉంటామని జగన్ ఉద్దేశమా? వీరికి సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్ర చేసే అర్హత ఉందా? అని ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఆండ్ర మాల్యాద్రి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.