Kuruba Community Rally for CBN: బాబుకు మద్దతుగా కనగానపల్లిలో ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు.. సర్దిచెప్పిన టీడీపీ నేతలు - శ్రీసత్యసాయి జిల్లా తాాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 4:55 PM IST
Kuruba Community Rally for CBN: శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మద్దతుగా కురబ సామాజికవర్గం చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా.. ఆయనకు సంఘీభావం తెలుపుతూ కురబ సామాజికవర్గం శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది. దీంతో మండలంలోని కురబలంతా కనగానపల్లి చేరుకున్నారు.
తెలుగుదేశం నేతలు పార్థసారథి, పరిటాల సునీత, శ్రీరామ్‌లు ఈ ర్యాలీలో పాల్గొని.. వారికి తమ మద్దతు తెలిపారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలంటూ.. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీ చేపట్టారు. శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన వారిని.. పోలీసులు అడ్డుకోగా.. కురబ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్ పోలీసులకు నచ్చచెప్పి ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలికిపాటు రాజకీయాలు మానుకోవాలని.. టీడీపీ నేతలు హితవు పలికారు.