Neet 112 Rank: ప్రణాళికబద్ధంగా చదివాడు.. అనుకున్నది సాధించాడు
Kurnool Mp Son Secured 112 Rank In 2023 Neet: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో ఈ యువకుడు సత్తాచాటాడు. స్పష్టమైన లక్ష్యంతో.. ప్రణాళికబద్ధంగా గంటల తరబడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. దాదాపు 20 లక్షల మందితో పోటీ పడి.. 112 ర్యాంకు పొందాడు. అతని కుటుంబ సభ్యులు డాక్టర్ కావడం అనేది వంశపారంపర్యంగా వస్తోన్న వృత్తిగా భావిస్త్తారు. అలాగే తాను కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ కావాలనుకున్నాడు ఆ యువకుడు. తల్లి, అధ్యాపకులు చెప్పిన సూచనలను చక్కగా పాటించి చదువుల్లో రాణించాడు. ఫలితంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షల్లో సత్తాచాటాడు. జాతీయ స్థాయిలో 112వ ర్యాంకుతో శభాష్ అనిపించుకున్నాడు. 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించాడు. అతడే కర్నూలు ఎంపీ కుమారుడు అభిరాం. మరీ, ఇంత మంచి ర్యాంకు సాధించటానికి ఆ యువకుడు ఎంచుకున్న మార్గం ఏంటి..? తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా అందింది..? భవిష్యత్ లక్ష్యం ఏంటి..? ఆ ర్యాంకర్ మాటల్లోనే విందాం.