ఆంధ్రప్రదేశ్

andhra pradesh

KS RamaRao_has_Taken_Charge_New_EO_of_Durga_Temple

ETV Bharat / videos

kanakadurga Temple New EO: దుర్గ గుడి ఈవోగా కేఎస్ రామారావు బాధ్యతల స్వీకరణ.. భ్రమరాంబకు వీడ్కోలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 4:54 PM IST

KS RamaRao has Taken Charge New EO of Durga Temple : ప్రముఖ పుణ్యక్షేత్రం.. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ నూతన ఈవోగా కేఎస్‌ రామారావు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం నూతన ఈవో భాద్యతలు స్వీకరించి.. గత ఈవో భ్రమరాంబకు గౌరవ మర్యాదలతో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. గతంలో ఉన్న భ్రమరాంబ స్థిరమైన విధానాల వల్ల దసరా నిర్వహణ తేలికగా ఉంటుందని ఈవో రామారావు పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి నుంచి... అక్టోబర్ 1న ఈవో భ్రమరాంబను బదిలీ చేసిన ప్రభుత్వం.. డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి ఎం.శ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆయన విధుల్లో చేరకపోవడం వల్ల.. శ్రీకాళహస్తి ఆర్డీవోగా పనిచేస్తోన్న కేఎస్ రామారావును దుర్గగుడి నూతన ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని సర్కార్ ఆదేశించడంతో రామారావు ఈవోగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

ABOUT THE AUTHOR

...view details