Kovvur SC Hostel : జగన్ మామయ్యా.. మాకేంటి ఈ పరిస్థితి.. చిన్న గదిలోనే నిద్రిస్తున్న 70 మంది విద్యార్థలు - ఎస్సీ హాస్టల్ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 11:30 AM IST
|Updated : Sep 23, 2023, 12:34 PM IST
Kovvur SC Hostel has No Facilities :తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ప్రభుత్వ వసతి గృహ భవనం పెచ్చులూడి ప్రమాదకంగా ఉంది. ఎప్పుడు ఏమి అవుతుందో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నాయి. చేసేది ఏమి లేక హాస్టల్ సమీపంలో ఉన్న బడిలో నిద్రిస్తున్నారు. బడిలోని ఓ చిన్న గదిలో సుమారు 70 మంది విద్యార్థులు సర్దుకుని పడుకోవాల్సిన పరిస్థతి ఏర్పడింది.
కొవ్వూరులోని ఎస్సీ వసతి గృహ భవనం పెచ్చులూడి వర్షపు నీరు లోనకి వస్తోంది. పైగా కనీస సౌకర్యాలు కూడా లేవు. ఇంకా ఏమి చేయలేక విద్యార్థులు గత మూడు రోజులుగా హాస్టల్ సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో పడుకుంటున్నారు. గురవారం రాత్రి ఓ చిన్న గదిలో సుమారు 70 మంది వరకు సర్దుకుని పడుకున్నారు. పడుకున్న విద్యార్థులు కనీసం పక్కకు తిరగడానికి స్థలం కూడా లేదు. విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని సీఎం జగన్ చెబుతున్నా మాటలకు.. క్షేత్ర స్థాయి పరిస్థితులు చూస్తే ఏ మాత్రం సంబంధం ఉండటం లేదని చెప్పాడానికి ఈ వసతి గృహ దుస్థితే నిదర్శనంగా నిలుస్తోంది.