Train Accident: ప్రమాద సహాయక చర్యల్లో రైల్వే కార్మిక సంఘాలు - ఈస్ట్ కోస్ట్ రైల్వే
EcoRSU on Train Accident: ఒడిశాలో కోరమాండల్ రైలు ఘటనపై రైల్వే కార్మిక సంఘాల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నేరుగా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని చెప్తున్నారు.. ఇందులో భాగంగా రైల్వే కార్మిక సంఘ నాయకులు ఆర్వీఎస్ఎస్ రావు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరును వివరించారు. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ రైలు ఢీకొనడం ద్వారా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం సహాయక చర్యల నిమిత్తం ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ సెక్రటరి నాయకత్వంలో దాదాపు 500 మంది కార్మికులతో ఘటనా స్థలానికి చేరుకొని భద్రతా చర్యలు.. అలాగే అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు భద్రతాపరంగా చాలా చర్యలు చేపడుతున్నామని.. అలాగే దానికి అవసరమైన నిధుల కేటాయింపు జరుగుతోందని వివరించారు. దీని కారణంగా ప్రమాదాలు చాలా మేరకు తగినట్లు తెలిపారు. ఇప్పుడు జరిగిన కోరమాండల్ ప్రమాదంపై కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి ప్రమాదం జరిగిన స్థలాన్ని, పరిస్థితులను పరిశీలించి కమిటీ వేస్తారని.. రాబోవు రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటారని ఆర్వీఎస్ఎస్ రావు చెప్పారు.