Aqua Pond: ప్రభుత్వ భూమిలో ఆక్వా చెరువు తవ్వకాలు.. అడ్డుకున్న స్థానికులు - కొండంగి గ్రామస్థుల అందోళన
Villagers Prevented Excavation of the Aqua Pond: ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండంగిలో ప్రభుత్వ భూమిలో ఆక్వా చెరువు తవ్వకాన్ని వ్యతిరేకిస్తూ.. గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఉప్పుటేరుకు సమీపంలోని ప్రభుత్వ భూమిలో ఆక్వా చెరువు తవ్వకాన్ని.. 3 రోజుల క్రితం గ్రామస్థులు అడ్డుకున్నారు. నేడు మరోసారి చెరువు తవ్వెందుకు యత్నించగా కొండంగి సేవాసమితి ఆధ్వర్యంలో గ్రామస్థులు అక్కడకు చేరుకుని మరోసారి అడ్డుకుని నిరసన తెలిపారు. చెరువు తవ్వకంతో ఉప్పుటేరు కట్టలు బలహీనమవుతాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆక్వా చెరువు పనులు నిలిపేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చెరువు తవ్వకం వల్ల పరిసర ప్రాంతాల్లోని 8 గ్రామాల వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకం వల్ల దీని పక్కనే రహదారి ధ్వంసం అవుతుందని.. ఈ రోడ్డును గ్రామస్థులంతా కలిసి ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ఇది ధ్వంసమైతే పునఃనిర్మించలేరని అభిప్రాయం వ్యక్తం చేశారు.