ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోనసీమ రుచులు

ETV Bharat / videos

Food Festival in Dolphin Hotel: విశాఖ డాల్ఫిన్​ హోటల్​లో కోనసీమ ఫుడ్​ ఫెస్టివల్​.. ఎన్నెన్నో ప్రత్యేకతలు - చిరుధాన్యాలతో చేసిన వంటలు

By

Published : Jul 15, 2023, 5:54 PM IST

Konaseema Food Festival in Dolphin Hotel: కోనసీమ అంటే అందం, అభిరుచి కలిగిన రుచులు మిశ్రమం. అలాంటి అందాన్ని ఆస్వాదించే ఘుమఘుమల రుచులను విశాఖలో డాల్ఫిన్ హోటల్ అందిస్తోంది. కోనసీమ ఫుడ్‌ ఫెస్టివల్‌ పేరుతో పది రోజుల పాటు కోనసీమ రుచులను ఆహార ప్రియులకు డాల్ఫిన్‌ హోటల్ అందిస్తోంది. వచ్చే ప్రతి అతిథికి కోనసీమ స్టైల్‌లో మర్యాదలు చేయటం, స్వాగతం పలకటం వంటివి విశాఖ వాసులను ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. కోనసీమ రుచులతో స్వీట్స్, మాంసాహారం, కొబ్బరి, మామిడి, అరటి తోరణాల అలంకారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అచ్చం కొనసీమలో ఉన్నామా అనిపించే రీతిలో చక్కని, పచ్చని అలంకారంతో కోనసీమ రుచులతో ఆహార ప్రియులకు తీపి గుర్తులను అందిస్తోంది. బెల్లంపాకంలో ఊరిన గారెలు, సున్నుండలు, మామిడి తాండ్ర, బెల్లం చెక్కిలు, సగ్గుబియ్యం పాయసం, పనస కాయ బిర్యానీ.. ఇవే కాకుండా ఆహార ప్రియులకు పిత్తపరిగిల పులుసు, తలకాయ మాంసం, తమలపాకు బజ్జి, ఇలా ఎన్నో విభిన్న ఆహారాలను కోనసీమ ఫుడ్ ఫెస్టివల్​లో రుచి చూపిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details