Konaseema Collector Reacted on Nadu Nedu Story: నాడు-నేడు కథనానికి స్పందన.. పాఠశాల సమస్యల్ని పరిష్కరించిన ఎంఈవో ప్రకాష్ - కోనసీమ జిల్లా వార్తలు
Konaseema Collector Reacted on Nadu Nedu Story: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడి ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పథకంలో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపాలపై నాడు-నేడు.. నాణ్యతే లేదు' చూడు శీర్షికతో ఈనాడు, ఈటీవీ భారత్ ప్రచురించిన కథనంపై జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పందించారు. సమస్యను పరిష్కరించమని అధికారుల్ని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అంబాజీపేట ఎంఈవో మోకా ప్రకాష్ నందంపూడి ఎంపీపీ ప్రాథమిక పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్‌ని వివరణ కోరారు. పాఠశాల మరుగుదొడ్డుకి వెంటనే తలుపులు ఏర్పాటు చేస్తామని పాఠశాల ప్రిన్సిపల్ ప్రకాష్ రావు.. ఎంఈవోకి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దగ్గరే ఉండి పనుల్ని పరిశీలించిన ఎంఈవో పాఠశాలలోని ఇతర సమస్యల్ని పరిష‌్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈటీవీ-ఈనాడు, ఈటీవీ భారత్‌కు తెలిపారు.
నాడు-నేడు పనులతో బడుల రూపురేఖలు మార్చేశామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌కి(AP CM Jagan Mohan Reddy).. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఆ డొల్లతనమేంటో తెలుస్తుంది. మొదటి విడత పనులు పూర్తి చేసి, రెండు సంవత్సరాలు గడవక ముందే.. పాఠశాలల్లో సమస్యలు పునరావృతమవుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడి ఎంపీపీ పాఠశాలలో టైల్స్‌తో వేసిన ఫ్లోరింగ్ కుంగిపోయింది. మరుగుదొడ్లకు వేసిన తలుపులు ఊడిపోయాయి. గోడలపై వేసిన చిత్రాల రంగులు వెలిసిపోయాయి. ఈ రంగులపై మరోసారి కొత్తగా వేసిన రంగులూ వెలిసిపోయాయని వార్తను పబ్లిష్ చేశాం.దీనిపై స్పందించిన అధికారులు వివరణ ఇచ్చారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.