ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Koil_Alwar_Thirumanjanam_in_Tiruchanur_Temple

ETV Bharat / videos

తిరుచానూరు పద్మావతి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - tirumala news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 6:12 PM IST

Koil Alwar Thirumanjanam in Tiruchanur Temple :తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వేడుకను నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణ చేశారు. కోయిల్‍ ఆళ్వార్‍ తిరుమంజనం అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

 ఈ వేడుకల్లో తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్​ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయానికి  హైదరాబాదు, గుంటూరుకు చెందిన భక్తులు 15 పరదాలను విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తితిదే ఛైర్మన్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details