ఆంధ్రప్రదేశ్

andhra pradesh

knife_attack_on_wife_and_husband_in_satyasai_district

ETV Bharat / videos

వరుస హత్యాయత్నాలు- భయంతో వణుకుతున్న ప్రజలు - ఆ వీధిలో మిస్టరీగా మారిన దాడులు - సత్యసాయి జిల్లా తాజా నేర వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 12:35 PM IST

Knife Attack On Wife and Husband In Satyasai District :వరుస దారుణ హత్యాయత్నాలతో  విజయనగరం కాలనీ వాసులు భయంతో వణికిపోతున్నారు. సత్యసాయి జిల్లా తాడిపత్రిలో దంపతులపై అగంతకుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వారికి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విజయ్‌నగర్‌ కాలనీలో ఉండే విశ్రాంత ఆర్మీ ఉద్యోగి వెంకటరమణ, ఆయన భార్య రమాదేవిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వంటగదిలో ఉన్న రమాదేవి గొంతును కత్తితో కోశాడు.

Tadipatri Latest Crime News :నొప్పితో ఆమె గట్టిగా అరవడంతో పక్క గదిలో ఉన్న ఆమె భర్త వెంకటరమణ పరుగున వచ్చాడు. అగంతకుడు ఆయన పైనా కత్తితో దాడి చేయడంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తాడిపత్రిలోని విజయ్‌నగర్‌ కాలనీలో ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం దీంతో మూడోసారి కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details