kiren Rijiju Met CM Jagan: సీఎం జగన్‌తో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు భేటీ - సీఎం జగన్‌తో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు భేటీ
kiren rijiju met cm jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయన సమావేశమయ్యారు. అధికార పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి.. సీఎం జగన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు. వీరిది మర్యాదపూర్వక భేటీగా సీఎంవో వర్గాలు తెలిపాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఎంపీ బాలశౌరి, మంత్రి జోగి రమేష్, మత్స్యకార సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు సముద్రంలో ఏ విధంగా చేపల వేట చేయాలి.. ఏ ప్రదేశంలో ఎక్కువగా మత్స్యసంపద లభ్యమవుతాయి అనే విషయాలను తెలియజేశారు. సముద్రంలో అలల ఉద్దృతి ఏ విధంగా ఉందో.. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే విధంగా భారత ప్రభుత్వం యాప్లను తయారుచేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని కిరణ్ రిజిజు తెలిపారు. అదే విధంగా కొత్త టెక్నాలజీతో బోట్లను తీసుకురావడం వలన మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పని చేస్తున్నాయని అన్నారు.