Song on NTR: ఎన్టీఆర్ జీవిత చరిత్ర.. పాట రూపొందించిన టీడీపీ - సీనియర్ ఎన్టీఆర్‌పై పాట
CD Release On NTR: తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము సారధ్యంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర, జీవిత విశేషాలు గురించి ఒక పాటను రూపొందించడం జరిగింది. రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఈ పాటకు సంబంధించిన సీడీని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్, టీడీపీ నాయకులు కంభంపాటి రామ్మోహన్ రావు , టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురాం రాజు , తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి జీవన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, తానా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తదితరులు పాల్గొన్నారు.
TDP Mahanadu 2023: మరోవైపు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని టీడీపీ చూస్తోంది. అవే విధంగా వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంతో పాటు.. రాజకీయ విధానాలు, ఎన్నికల మేనిఫెస్టో ప్రాథమిక అంశాలపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వనున్నారు.