King Cobra Viral Video పంట పొలాల్లో కింగ్ కోబ్రా హల్చల్..బంధించిన అటవిశాఖ అధికారులు - అనకాపల్లిలో నల్లత్రాచు వీడియో
King Cobra Viral In Anakapally :అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు శివారు పొలాల్లో ఓ భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది. వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న రైతులకు కోబ్రా కనిపించటంతో ఒక్కసారి హడలెత్తి పరుగులు తీశారు. ఇది ప్రపంచంలోనే అతి విషపూరిత పాము కావడంతో జనాలు భయాందోళనలు చెందారు. కర్షకులు పనులన్నీ ఆపేసి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విశాఖపట్నం నుంచి వన్యప్రాణి సంరక్షణ ప్రతినిధి మూర్తి బృందం కింగ్ కోబ్రా ఉన్న పొలానికి చేరుకున్నారు. గంట సేపు తీవ్రంగా శ్రమించి.. పామును సజీవంగా పట్టుకున్నారు. దానిని ఓ సంచిలో బంధించి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు అటవీ శాఖ అధికారి శివకుమార్ చెప్పారు. కింగ్ కోబ్రా పొడవు దాదాపుగా 13 అడుగులకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద కింగ్ కోబ్రాను చూడడం ఇదే తొలిసారి అని స్థానికులు చెప్పారు. పామును పట్టుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.