ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Khelo_India_Women_Rugby_League_Competitions_at_Delhi_Public_School_in_Kurnool

ETV Bharat / videos

రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది - ఖేలో ఇండియా రగ్బీ లీగ్ పోటీల్లో టీజీ వెంకటేశ్ - Khelo India Women Rugby League Competitions latest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 3:53 PM IST

Khelo India Women Rugby League Competitions at Delhi Public School in Kurnool: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఖేలో ఇండియా ఉమెన్స్ రగ్బీ లీగ్ పోటీలు కర్నూలు జిల్లాలో దిల్లీ పబ్లిక్ స్కూల్​లో ప్రారంభమవ్వాయి. ఈ కార్యక్రమాన్ని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. రగ్బీ లీగ్ పోటీలు మూడు రోజులు జరగనున్నట్టు దిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ జష్మీత్ కౌర్ సెఖోన్ తెలిపారు.

దిల్లి పబ్లిక్ స్కూల్​లో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో అండర్౼ 14,18 విభాగాల్లో బాలికలకు రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లోనూ పాల్గొనాలన్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే క్రీడలతో పాటు చదువుల్లో కుడా రాణిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల ఆశ్రద్ధ చూపుతుందని, కొన్ని క్రీడలకు సంబంధించి మైదానంలో ఆడేందుకు డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. ఈ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని  టీజీ వెంకటేష్ అన్నారు. విద్యార్థులు రగ్బీ పోటీల్లో ఆసక్తి కనబరుస్తున్నారని స్కూల్ ప్రిన్సిపల్ జష్మీత్  తెలిపారు. 18,19,20 తేదీలలో జరుగుతున్నాయన్నారు. ఫైనల్స్​లో స్టేట్ వైడ్ ప్లేయర్స్ పాల్గొంటారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details