ఆంధ్రప్రదేశ్

andhra pradesh

kesineni_nani.

ETV Bharat / videos

విజయవాడపై కక్షతో జగన్ ప్రైమ్ ఏరియాను శ్మశానంలా మార్చారు: ఎంపీ కేశినేని

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 3:24 PM IST

Kesineni Nani Inspect Vijayawada Benz Circle Road Widening Works:విజయవాడ నగరంపై కక్ష గట్టిన సీఎం జగన్​ ప్రైమ్​ ఏరియాను శ్మశానంలా మార్చాలని చూశారని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. బెంజ్​సర్కిల్ సర్వీస్ రోడ్డు విస్తరణ పనులను ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్, ఎన్​హెచ్​ అధికారులు పరిశీలించారు. రోడ్డు విస్తరణకు రూ. 60 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించి నిధులు మంజూరు చేయించానని గుర్తు చేసారు. పడమర రోడ్డు విస్తరణకు మరో 15 కోట్లు కేంద్రమే ఇచ్చేలా గడ్కరీని ఒప్పించానన్నారు. వైసీపీ నుంచి 30 మంది ఎంపీలు పేరుకు మాత్రమే ఉన్నారు తప్ప ప్రజల కంటికి వారెవ్వరూ కనిపించరని ఎద్దేవా చేసారు. యధా జగన్, తథా ఎంపీలు అన్నట్లే వైసీపీ ఉందని ఆక్షేపించారు. 

విజయవాడ ప్రజలు ఎలాగో వైసీపీకి ఓటు వేయరని ఈ ప్రాంత నాశనానికి జగన్ పూనుకున్నాడని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ధ్వజమెత్తారు. అధికారంలో లేకపోయినా తామే పోరాడి సర్వీస్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యేలా చేశామని వెల్లడించారు. 9.5 మీటర్ల తారు రోడ్డు, 1.5 మీటర్ల డ్రైన్​తో విస్తరణ పనులు చేపడతున్నామన్నారు. కార్పొరేషన్ అండర్ గ్రౌండ్ పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details