ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kesineni_Nani_Comments

ETV Bharat / videos

నేను దోచుకోను- ఎదుటివారిని దోచుకోనివ్వను: ఎంపీ కేశినేని నాని - విజయవాడకేశినేనివ్యాఖ్యలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 1:13 PM IST

Kesineni Nani Comments: నీతి నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వాఖ్యలు చేశారు. ప్రజాసేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, సంపాదన కోసమే రాజకీయాల్లోకి రావడం ప్రస్తుతం కొందరికి ఫ్యాషన్​గా మారిందని నాని వ్యాఖ్యానించారు. తాను దోచుకోను, వేరొకరిని దోచుకోనివ్వనని, అందుకే తనపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో అవినీతి, అక్రమార్కుల్ని సహించేది లేదని, వారితో పోరాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కొన్ని కబంధహస్తాల నుంచి విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నాని నాని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని కేశినేని నాని తెలిపారు.

పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఎం.ఎస్.బేగాంకు తన పూర్తి మద్దతు ఇస్తున్నానని, నిజాయతీగా పనిచేసే ముస్లిం నాయకులు పార్టీకి అవసరమని స్పష్టం చేశారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పి.హరిబాబుతో పాటు వైసీపీకి చెందిన పలువురు నాయకులు సోమవారం కేశినేని సమక్షంలో టీడీపీలో చేరారు.

ABOUT THE AUTHOR

...view details