ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Keshineni_Nani_Followers_Shock

ETV Bharat / videos

వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైన కేశినేనికి అనుచరుల షాక్‌ - వైఎస్సార్సీపీలో కేశినేని

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 11:46 AM IST

Keshineni Nani Followers Shock: ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పలువురు నేతలు సొంత పార్టీలను వీడి మరో పార్టీల్లో చేరుతున్నారు. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలోకి, వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ, జనసేనలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైన కేశినేని నానికి ఆయన అనుచరులు గట్టి షాకిచ్చారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైన కేశినేని నానితో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. 

తనతో రావాల్సిందిగా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని ముఖ్య అనుచరులకు కేశినేని ఫోన్లు చేయగా వారు నిరాకరించారు. మైలవరం తెలుగుదేశం నేత బొమ్మసాని సహా, మిగిలిన నేతలెవ్వరూ తెలుగుదేశం వీడి వచ్చేదే లేదంటూ కేశినేనికి స్పష్టం చేశారు. జగన్ ఇంటి గడప తొక్కాక కేశినేనిని కలిసేదే లేదని బొమ్మసాని తేల్చి చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలిసిన బొమ్మసాని సుబ్బారావు, గన్నే ప్రసాద్‌ తెలుగుదేశంలోనే ఉంటానని స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details