ఆంధ్రప్రదేశ్

andhra pradesh

kadapa_vanabhojanam_programme

ETV Bharat / videos

కడపలో కార్తిక వనభోజనాలు, ముఖ్యఅతిథిగా హాజరైన సినీ నటి మంజుభార్గవి - కార్తిక వనభోజన కార్యక్రమం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 2:03 PM IST

Kartika Vanabhojana Programme in Kadapa : వైఎస్సార్ జిల్లా కవులకు, కళాకారులకు పుట్టినిల్లని సినీ నటి మంజు భార్గవి కొనియాడారు. సమైక్య బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తిక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంజు భార్గవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం మంజు భార్గవి చిన్నారులకు బహుమతులను అందజేసింది. సమైక్య బ్రాహ్మణ సంఘం ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మంజుభార్గవి తెలిపారు. 

అన్నమయ్య, అయ్యలరాజు రామభద్రుడు, కవి చౌడప్ప, గడియారం వెంకట శేషశాస్త్రి లాంటి గొప్ప కవులు వైఎస్సార్ జిల్లాలోనే జన్మించారని మంజు భార్గవి గుర్తు చేశారు. తనకు కడప అంటే ఎంతో అభిమానం అని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమానికి చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సంస్కృతిక కార్యక్రమంలో తమ పిల్లలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details