ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Karthika_Masam_Poli_Padhyami_Poojalu

ETV Bharat / videos

ఘనంగా పోలి పాడ్యమి పూజలు - జనసంద్రంగా మారిన ఆలయాలు - Temples Crowded with Devotees in West Godavari

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 12:41 PM IST

Karthika Masam Poli Padhyami Poojalu: పోలి పాడ్యమి సందర్భంగా జిల్లాలోని కాలువలు, గోదావరి తీరాలు మహిళల దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం చివరి రోజు పురస్కరించుకుని రాష్ట్రంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కోనసీమ జిల్లాలో పలు ప్రాంతాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే పూజలు ప్రారంభించారు. పోలి పాడ్యమి పండుగ సందర్భంగా అరటి దొప్పల్లో దీపాలు ఉంచి నది పాయలు, కాలువల్లో విడిచిపెట్టారు. పి. గన్నవరం మండలంలో వందల సంఖ్యలో మహిళలు దీపాలు వెలిగించి పోలంబను స్వర్గానికి సాగనంపి పూజలు చేశారు. 

Temples Crowded with Devotees in West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ప్రాంగణం కార్తీక దీపాల వెలుగులలో పండుగ శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే మహిళలు అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి చేరుకుని దీపారాధనలు చేసి దీపాలు కాలువలో వదిలారు.

Poli Padhyami Celebrations in Guntur: గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని శివాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అరటి దొప్పల్లో నూనె దీపాలు వెలిగించి కృష్ణా నదిలో వదిలారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్ వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details