ఆంధ్రప్రదేశ్

andhra pradesh

kanna_laxminarayana_comments_on_next_cm_jagan_comments

ETV Bharat / videos

జగన్​ మళ్లీ సీఎం కావాలనే వ్యాఖ్యాలపై టీడీపీ నేత కన్నా గరం గరం - అవసరం లేదని ఓ పుస్తకమే రాయొచ్చంటూ విసుర్లు - కన్నా లక్ష్మీనారాయణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 5:00 PM IST

Kanna Laxminarayana Comments On Next CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్​ మోహన్​ రెడ్డి ఎందుకు అవసరం లేదో.. 100 కారణాలకో ఓ పుస్తకమే ముద్రించవచ్చని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఒక్క ఛాన్స్​ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని జగన్‌ సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఏపీకి జగన్‌ ఎందుకు కావాలో ఒక్క కారణం చెబితే చాలని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఏపీకి జగన్‌ ఎందుకు అవసరం లేదో వంద కారణాలు చెప్పగలమని స్పష్టం చేశారు. మరోసారి జగన్​ ముఖ్యమంత్రిగా ఎందుకు అవసరం లేదో పుస్తకమే ప్రింట్ తీయవచ్చని వివరించారు. ​ 

రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకా జగన్‌క మళ్లీ సీఎం కావాలంటున్నారని ప్రశ్నించారు. 2019 నాటికి పోలవరం నిర్మాణం 75 శాతం పూర్తిచేసి చంద్రబాబు ఇచ్చారని.. మిగిలిన 25 శాతం పోలవరం పూర్తిచేయకుండా పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణకు తాకట్టు పెట్టినందుకు జగన్‌ మళ్లీ సీఎం కావాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో ఇస్తున్న సొమ్మును నాన్న బుడ్డి పేరుతో కొట్టెస్తున్నందుకు మళ్లీ ముఖ్యమంత్రి కావాలా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details