సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి ఖరారు - ధ్రువీకరించిన అధిష్టానం - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 1:33 PM IST
Kanna Lakshminarayana is TDP candidate for Sattenapally Constituency:పల్నాడు జిల్లాసత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా అధిష్టానం తన పేరునే ఖరారు చేసినట్లు టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్రువీకరించారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. తమకు టికెట్ వస్తోందని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు కన్నా వెల్లడించారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి శాసనసభ టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీ నారాయణనే పోటీ చేస్తారనే విషయాన్ని రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారని తనకే దాదాపు టికెట్ ఇస్తారని కన్నా పేర్కొన్నారు. జరగబోయే ఎన్నికలలో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని వైసీపీ ఓడిపోవడం ఖాయమని కన్నా అన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో తెలుగుదేశం శ్రేణులు, కన్నా అభిమానులు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు.