ఆంధ్రప్రదేశ్

andhra pradesh

kanna_lakshminarayan_allegations

ETV Bharat / videos

Kanna Lakshminarayan Allegations Against CM Jagan: 'జగన్​కు అక్రమ కేసుల నమోదుపై ఉన్న శ్రద్ధ.. రైతుల సమస్యలపై లేదు' - Farmers suffering from lack of cultivation in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 4:45 PM IST

Kanna Lakshminarayan Allegations Against CM Jagan:సాగర్‌ నుంచి తెలంగాణ నీటిని తరలించుకుపోతున్నా సీఎం జగన్‌ చోద్యం చేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కుడి కాలువ పరిధిలో పంటలు ఎండుతున్నా సీఎం జగన్ చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పంటలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని జనవనరుల శాఖ కార్యాలయం వద్ద ధర్నాకు ఆయన పిలుపునివ్వడంతో పోలీసులను భారీగా మోహరించారు. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆంధ్ర రాష్ట్ర సంపదను, నీటిని తెలంగాణకు అప్ప జెప్పారని విమర్శించారు. కృష్ణా జలాలను ఎక్కువ శాతం తెలంగాణకు ఇచ్చిన జగన్.. మన రాష్ట్ర రైతులను సర్వనాశనం చేశాడని ధ్వజమెత్తారు. అక్రమ కేసుల నమోదుపై ఉన్న శ్రద్ధ రైతులపై జగన్​కు లేదని మండి పడ్డారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details