ఆంధ్రప్రదేశ్

andhra pradesh

kanipakam_Varasiddhi_Vinayaka_Brahmotsavam

ETV Bharat / videos

kanipakam Varasiddhi Vinayaka Brahmotsavam : కాణిపాక బ్రహ్మోత్సవాలు.. మొదటిరోజు హంసవానంపై విహరించిన స్వామివారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 2:09 PM IST

kanipakam Varasiddhi Vinayaka Brahmotsavam : చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి స్వామి వారు సిద్ధి బుద్ధి సమేతుడై హంసవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.

ముందుగా ఉత్సవ మూర్తులను సర్వాలంకృతులు చేసి అలంకార మండపంలో ప్రత్యేక నివేదన సమర్పించారు. తరవాత ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి హంస వాహనంపై అధిష్టించారు. కాణిపాకం పురవీధుల్లో స్వామి వారిని ఊరేగించారు. భక్తులు స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. హంస వాహనం ముందు చేసిన కోలాటాలు, చెక్కభజనలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబరు 18 నుంచి ప్రారంభమైన ఈ కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు (అక్టోబర్ 8) జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.  

ABOUT THE AUTHOR

...view details