ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kanakamedala_Complaint_on_YSRCP_Govt

ETV Bharat / videos

Kanakamedala Complaint on YSRCP Govt: ఏపీలో మానవ హక్కుల అణచివేత.. జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఫిర్యాదు - tdp mp Kanakamedala news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 3:47 PM IST

Kanakamedala Complaint on YSRCP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచక పాలన, రాజ్యాంగం కల్పించిన హక్కుల అణచివేతపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు.

Kanakamedala Comments: దిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్‌ అరుణ్‌మిశ్రాను కలిసిన అనంతరం ఎంపీ కనకమేడల మీడియాతో మాట్లాడారు. ''నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్, అంతకు ముందు జరిగిన పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు ఆరోగ్యం, రాజమండ్రి జైల్లో ఆయనను ట్రీట్ చేస్తున్న విధానాలు, ప్రతిపక్ష నాయకుల పట్ల వ్యవహరిస్తున్న విధానాలతో పాటు రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను హరించి వేయడంపై ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాను కలిసి ఫిర్యాదు చేశాను. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, విధ్వంసాలు జరుగుతున్నాయి. ఆ అంశాలన్నింటినీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం.'' అని ఎంపీ కనకమేడల తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details