ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kanaka_Mahalakshmi_Ammavari_Margasira_Masotsavam_in_Uttarandhra

ETV Bharat / videos

ఉత్తరాంధ్రలో కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు - అర్ధరాత్రి నుంచే ప్రత్యేక పూజలు - visakhapatnam Margasira Masotsavam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 3:33 PM IST

Kanaka Mahalakshmi Ammavari Margasira Masotsavam in Uttarandhra: విశాఖపట్నం బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. గురువారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో బుధవారం అర్ధరాత్రి దాటాక పూజలు నిర్వహించారు. బుధవారం అర్థరాత్రి 12.05 గంటలకు అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించామని అర్చకులు తెలిపారు. అమ్మవారికి ఆలయ అర్చకులు, వేదపండితుల సమక్షంలో పసుపు, కుంకుమ, పాలు, సుగంధద్రవ్యాలు కలిపిన జలాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు.

మార్గశిర మాసం తొలి గురువారం రావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ ఈఓ శిరీష పేర్కొన్నారు. దర్శన సమయంలో భక్తులు, ధర్మకర్తలు, దాతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని శిరీష తెలిపారు. ఈ నెలరోజులు అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజల్లో ప్రజలందరూ పాల్గొని దర్శనం చేసుకోవాలన్నారు. దేవస్థానం తరపున భక్తుల కోసం రెండు బస్సులు ఏర్పాటు చేశామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని శిరీష పిలుపునిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అర్ధరాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. 

ABOUT THE AUTHOR

...view details