ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం

ETV Bharat / videos

శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం..సింహగిరిపై దేదిప్య కాంతులు - అప్పన్న

By

Published : Apr 1, 2023, 2:14 PM IST

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం శనివారం అంకురార్పణతో ప్రారంభం కానున్నది. ఆదివారం రాత్రి 9:30 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి అనగా ఈ నెల రెండో తేదీన ముందుగా స్వామి వారి రథ యాత్ర ప్రారంభం కానున్నది. ప్రత్యేకంగా తయారు చేసిన స్వామి వారి రథంలో స్వామిని అధిష్టింప జేసి, తిరువీధి సేవ నిర్వహించి, అనంతరం ప్రత్యేక కళ్యాణ మండపంలో స్వామిని ఉంచి కళ్యాణాన్ని నిర్వహించనున్నారు. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ఈ నెల 16వ తేదీ వరకు ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. 

స్వామి వారికి జరిగే ప్రధాన ఉత్సవాల్లో భాగమైన కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలి వస్తుంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి గాలి గోపురాన్ని చుట్టూ ప్రాకారాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. కళ్యాణం అనంతరం ఏడు రోజుల పాటు వైభవంగా స్వామివారి వాహన సేవ ఉత్సవాలు నిర్వహిస్తారు. పోలీస్ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణం జరిగే సమయంలో దేవస్థానం రాత్రి పూట కూడా కొండపైకి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైదిక పరంగా నేటి నుండి రాత్రి ధ్వజారోహణతో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details