సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తెలంగాణ సీఎం మనవడు కల్వకుంట్ల హిమాన్షు - Himanshu Kalvakuntlaసోషల్ మీడియాలో కేటీఆర్ తనయుడు
Kalvakuntla Himanshu Sing Golden Hour Cover Song: ప్రస్తుత నవ యుగంలో యువతీ, యువకులు కాలంతో పోటీ పడుతున్నారు. కాలం కంటే వేగంగా నేటి యువతి, యువకులు పరిగెడుతున్నారు. వారు అనుకున్న లక్ష్యాలను సాధించి కాలానికి స్వాగతం పలుకుతున్నారు. పెద్దవారిని ఆశ్చర్య పోయేలా చేస్తున్నారు. అన్ని రంగాల్లోను తమ సత్తాను ప్రపంచానికి చాటి చెపుతున్నారు. సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే విభిన్న లక్ష్యాలను జీవిత ఆశయంగా ఎన్నుకుంటున్నారు. ఆశయాలను గాలికి వదిలేయకుండా వాటిని సాధించడానికి శక్తి సామర్థ్యాలకు మించి, ప్రాణాన్ని ఫణంగా పెట్టి కృషి చేస్తున్నారు. తిండి, నిద్రహారాలు మానేసి మరీ తమ గెలుపు కోసం అహర్నిశలు కష్ట పడతూ..ఇష్టంగా చేస్తున్నారు.
చాలా మంది తండ్రి అడుగులో అడుగులు వేయాలని అనుకుంటారు. కానీ ఇతను మాత్రం వారి నీడలో నడవ లేదు. తాత, తండ్రి, మేనత్తలాగా రాజకీయ బాటలో ప్రయాణించకుండా విభిన్నమైన దారి ఎంచుకున్నాడు. తన కష్టంతో ఎదగాలని, తనకంటూ ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని భావించిన ఇతను కార్యచరణ ప్రారంభించాడు. మ్యూజిక్ తనకు ఇంట్రెస్ట్ అని ప్రపంచానికి ఒక్క పాటతో తెలియజేశాడు. ఆ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గోల్డెన్ అవర్ అనే ఇంగ్లీష్ కవర్ సాంగ్‌ను పాడి అందరీ ప్రశంశలు అందుకుంటున్నాడు ఆ యువకుడు. అతను ఎవరో కాదు కల్వకుంట్ల వారసుడు. తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు, ఎమ్మెల్సీ కవిత మేనల్లుడు కల్వకుంట్ల హిమాన్షు.
ఈ పాటను కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని భావిస్తున్నానని ట్వీట్లో పేర్కొన్నారు. ఓ తండ్రిగా చాలా గర్వంగా ఉందని మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఈ పాటను ట్వీట్ చేశారు.