Kakinada Aditya College: కాకినాడ ఆదిత్య కళాశాలకు నాక్ గుర్తింపు.. రాష్ట్రంలో తొలి అన్ ఎయిడెడ్ ప్రైవేటు కాలేజీగా రికార్డు
Aditya Degree College achieved NAAC recognition: కాకినాడలోని ఆదిత్య డిగ్రీ కళాశాల నాక్ ఏ++ గుర్తింపు సాధించి రాష్ట్రంలోనే తొలి అన్ ఎయిడెడ్ ప్రైవేటు కళాశాలగా రికార్డు కెక్కింది. నాక్ కమిటీ బృందం జూన్ 26, 27 తేదీల్లో ఆదిత్య డిగ్రీ కళాశాలను సందర్శించింది. కళాశాల నాణ్యత ప్రమాణాలు, బోధనా పద్ధతులు, పరిశోధన ఆవిష్కరణలు, మౌళిక వసతులు, అభ్యాస వనరులు, విద్యార్థుల మద్దతు- పురోగతి, నిర్వహణ తదితర అంశాలను పరిశీలించింది. 3.66 స్కోరుతో గుర్తింపునిస్తూ కళాశాలకు సమాచారం ఇచ్చినట్టు ఆదిత్య కళాశాలల ఛైర్మన్ తెలిపారు. ఈ కళాశాలకు 2016లో నాక్ B గుర్తింపునివ్వగా.. తాజాగా ఏ హోదాతో గుర్తింపు ఇచ్చింది. విద్యా ప్రమాణాలు పాటించడంలో ఆదిత్య విద్యా సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని.. ఛైర్మన్ శేషారెడ్డి చెప్పారు. ఈ రాష్ట్రంలో వెయ్యికి పైగా కాలేజీలు ఉండగా.. ఏ కాలేజీ సాధించలేని గుర్తింపు ఆదిత్య కళాశాల సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే అటానమస్ కళాశాలగా గుర్తింపు తెచ్చుకుంటామని శేషారెడ్డి తెలిపారు.