Kadapa's Aruna Selected for Nehru Yuva Kendra Sangathan: 'పేయింగ్ హోమేజ్ టు నేషనల్ లీడర్స్' కార్యక్రమంలో పాల్గొన్న కడప యువతి - ఈ టీవీ భారత్ యువ స్టోరీస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 12:42 PM IST
Kadapa's Aruna Selected for Nehru Yuva Kendra Sangathan :సాధించాలనే సంకల్పం,కృషి, పట్టుదల ఉండాలే గానీ.. అమ్మాయిలు అనుకుంటే దేన్నైనా సాధిస్తారని అనడానికి కడపకు చెందిన జానగొండ అరుణే అందుకు నిదర్శనం. నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన ఎలక్యూషన్ పోటీల్లో పాల్గొని రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక యువతి అరుణ (Kadapa's Aruna Enters Parliament on October 2 ). ఈ నెల 2న గాంధీ జయంతి సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన యువతీ, యువకులకు పార్లమెంటును సందర్శించి, ప్రసంగించే అవకాశం దక్కింది. వారిలో రాష్ట్రం నుంచి అరుణ మాత్రమే దిల్లీ పార్లమెంటుకు వెళ్లడం విశేషం.
పార్లమెంటులో ప్రసంగాలు, స్పీకర్, మంత్రులు, పార్లమెంటు సభ్యులతో పరిచయాలు, అక్కడి అనుభూతులను పంచుకుంది ఈటీవీ భారత్తో అరుణ. తన జీవితంలో ఇదో గొప్ప అనుభవం అని చెబుతున్న యువతి.. పార్లమెంటుకు వచ్చిన వారిని చూస్తే అక్కడ మినీ భారత్ కనిపించింది అని చెబుతోంది. అంతే కాకుండా అక్కడ ఆమె పొందిన మరిన్ని అనుభవాల్ని తన మాటల్లోనే తెలుసుకుందాం పదండీ..