ఆంధ్రప్రదేశ్

andhra pradesh

kadapa_police_arrested_accused_in_murder_case

ETV Bharat / videos

హత్య కేసుల్లో నిందితుల్ని అదుపులోకి తీసుకున్న కడప పోలీసులు - కత్తితో పొడిచి హత్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 10:27 AM IST

Kadapa Police Arrested Accused in Murder Case: కడప నగరంలో ఈ నెల 12న జరిగిన రెండు వేరువేరు హత్యలకు సంబంధించి.. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు హత్యలు పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపం పల్లెకు చెందిన సాయి కిరణ్ అనే యువకుడు మహేంద్ర అనే వ్యక్తికి 50 వేలు అప్పుగా ఇచ్చాడు. సకాలంలో తిరిగి ఇవ్వకపోవడంతో సాయికిరణ్ ఒత్తిడి చేశాడు. దీంతో శ్రీరామ్‌, మహేంద్ర కలిసి సాయికిరణ్‌ను ఈ నెల 12వ తేది రాత్రి టీ దుకాణంలో కత్తితో పొడిచి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మహేంద్ర, శ్రీరామ్‌లను అరెస్టు చేశారు. 

మరో కేసులో ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ నెల 12వ తేదీన జీవిత బీమా కార్యాలయంలో డిజిటలైజేషన్ విభాగంలో పనిచేస్తున్న భవాని శంకర్‌ను అతని స్నేహితుడు మల్లికార్జునస్వామి కత్తితో హత్య చేశాడు. మల్లికార్జునస్వామి భార్యతో భవాని శంకర్‌కు మధ్య అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు ధ్రువీకరించారు. మల్లికార్జునస్వామితో పాటు హత్యకు సహకరించిన ఆటో డ్రైవర్‌ రంజిత్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details