ఆంధ్రప్రదేశ్

andhra pradesh

kadapa_district_kamalapur_constituency_farmers_protest

ETV Bharat / videos

"సీఎంకు కష్టాలు చెప్పుకుందామని వెళ్తే అడ్డుకున్నారు - వైసీపీ హయాంలో నష్టపోయాం" - Kadapa District Farmers Protest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 5:09 PM IST

Kadapa District Kamalapur Constituency Farmers Protest: రైతులు తమ సమస్యలను సీఎం జగన్​కు విన్నవించుకునేందుకు బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. తమ కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పోలీసులకు వివరించినా అనుమతి ఇవ్వలేదని వాపోయారు. పోలీసుల తీరుతో నిరసనగా రైతులు రోడ్డుపై బైఠాయించగా వారిని అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. 

వైఎస్సార్​ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గాన్ని కరవు మండలంగా ప్రకటించాలని టీడీపీ నేత కాశిభట్ల సాయినాథ్‌శర్మ ఆధ్వర్యంలో రైతులు జగన్‌ను కలిసేందుకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో వారికి అనుమతి లేదని రైతులను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని సాయినాథ్‌శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కడప పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సమస్యలు విన్నవించేందుకు కమలావురం మండలం రామాపురం నుంచి ర్యాలీగా బయలుదేరినట్లు ఆయన తెలిపారు. తమను పోలీసులు అడ్డుకున్నారని, ఈ నేపథ్యంలో వారి తీరుకు నిరసనగా కార్యకర్తలతో కలిసి సాయినాథ్‌శర్మ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోటంతో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details