ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kadapa_Constable_Missing

ETV Bharat / videos

కడపలో కానిస్టేబుల్ అదృశ్యం- ఆందోళనలో కుటుంబ సభ్యులు - Government General Hospital

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 5:17 PM IST

Kadapa Constable Missing: కడప పోలీస్ స్టేషన్​లో పనిచేస్తున్న బిన్నీ రాజు అనే కానిస్టేబుల్ అదృశ్యమయ్యారు. కడప ఎన్జీవో కాలనీకి చెందిన బిన్నీ రాజు గౌతమీలకు కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు సంతానం. బిన్నీ రాజు కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 15న అనారోగ్యంగా ఉందని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(Government General Hospital)కి వెళ్లారు. తర్వాత ఆయన ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కానిస్టేబుల్ బిన్నీ రాజు భార్య(Constable Binny Raju Wife), కుటుంబ సభ్యులు కలిసి చుట్టుపక్కల బంధువుల నివాసాల్లో ఆయన కోసం గాలించారు.

Constable Binny Raju Missing Case: తెలిసిన ప్రాంతాలతో పాటు స్థానిక పరిసరాల్లో ఎంత వెతికినా ఆయన ఎక్కడా కనిపించకపోవడంతో ఇవాళ రిమ్స్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై అదృశ్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిన్నీ రాజు కాల్ డేటా ఆధారంగా పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details