ఆంధ్రప్రదేశ్

andhra pradesh

JSP Leaders Support to TNSF President Hunger Strike: టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించిన జనసేన నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2023, 10:34 PM IST

TNSF President Pranav Gopal Hunger Strike

JSP Leaders Support TNSF President Hunger Strike తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ మెుదలు.. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుల ప్రకటన వెలువడిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికారపార్టీ అక్రమ అరెస్ట్​లపై తెలుగుదేశం, జనసేన కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ విశాఖలో  టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ చేస్తున్న నిరసన దీక్షకు జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్, పివిఎస్ఎన్ రాజు సంఘీభావం ప్రకటించడం స్థానికంగా ఆసక్తిగా మారింది. 

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రణవ్ గోపాల్ కు సంఘీభావం తెలుపినట్లు జనసేననేతలు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ అని దేశం మొత్తం చూసిందని  పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ పతనానికి ఆఖరి అడుగు వేసుకుంది అన్నారు. టీడీపీ చేస్తున్న న్యాయ పోరాటానికి ప్రతి జన సైనికుడు అండగా నిలవాలని చెప్పుకొచ్చారు. అధినేత కోసం నిరాహారదీక్ష చేస్తున్న టిఎన్ఎస్ఎఫ్, టీడీపీ నేతలను అభినందించారు. 

ABOUT THE AUTHOR

...view details