Join into TDP: వైసీపీకి షాక్.. సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో 30 కుటుంబాలు టీడీపీలోకి చేరిక - వైఎస్సార్ జిల్లాలో టీడీపీలోకి చేరికలు
Join into TDP: అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలంలో.. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలంలోని వివిధ గ్రామాల, మండల నాయకులతో పాటు.. వేంపల్లి పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలను కప్పుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీలోకి చేరికలను చూస్తుంటే.. ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గెలవడం అసాధ్యమని అర్థమవుతుందని బీటెక్ రవి అన్నారు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు.. పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.