ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ycp_to_tdp

ETV Bharat / videos

ఎన్నికల సమీపిస్తున్న వేళ - వైఎస్సార్​సీపీ నుంచి టీడీపీలోకి భారీగా పెరుగుతున్న చేరికలు - టీడీపీలో చేరికలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 10:24 PM IST

Joining From YCP to TDP Increasing:ఒక పక్క నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ల నియామకాల్లో వైఎస్సార్​సీపీ అధిష్టానం తర్జన బర్జన పడుతున్న తరుణంలో ఆ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరంలో 300 మంది వైఎస్సార్​సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వారు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కాగా మాజీ మంత్రి చినరాజప్ప కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మరో వైపు విజయనగరం 43వ డివిజన్​లో వైసీపీకి చెందిన 50 కుటుంబాలు నియోజకవర్గ ఇన్​ఛార్జి అదితి గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశంలోకి చేరాయి. వారందరికీ కండువా కప్పి అదితి గజపతిరాజు పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్​సీపీ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని అదితి విమర్శించారు. సంక్షేమ పాలన, మహిళా సాధికారత చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదితి పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details