Municipal workers strike జగన్ హామీల అమలు కోసం కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల యాత్ర - MUNCIPAL PARISUDYA KARMIKULA ANDOLANA
Problems of municipal Sanitation workers :రాష్ట్రంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరిన ఎలాంటి స్పందన లేదని మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు భూషణం అన్నారు. కార్మికులకు పనిముట్లను సకాలంలో అందించాలి. ఔట్ సోర్సింగ్ మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయలి. యూనిఫామ్, చెప్పులు, సబ్బులు, టవల్స్ ఇవ్వాలని తదితర సమస్యల పై రాష్ట్ర అధ్యక్షులు భూషణం ఆధ్వర్యంలో చేపట్టిన జీపు యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుంది. యాత్రకు సి.పి.యం నాయకులు, కార్మికులు స్వాగతం పలికారు. వసంతరావు, బాబూరావుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పురపాలక సంఘం కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది కాని. వాటిని అములు పరచడంలో విఫలం అయ్యిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు భూషణం హెచ్చరించారు.