ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

ETV Bharat / videos

వదిలేదే లేదు.. 14వ తేదీ నుంచి నేనేంటో చూపిస్తా.. : జేసీ ప్రభాకర్ రెడ్డి - తాడికొండలో అక్రమ ఇసుక రవాణా

By

Published : Apr 9, 2023, 5:06 PM IST

Updated : Apr 9, 2023, 8:08 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని ఆవుల తిప్పయపల్లి, గాదర గుట్టపల్లి గ్రామాల సమీపంలో ఉన్న కొండను తవ్వి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. గాదర గుట్టపల్లి గ్రామంలోని యువకులు కొండను తవ్వుతున్న ప్రదేశానికి వెళ్లారు. ఈ తవ్వకాలకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని కోరారు. అక్కడ జరుగుతున్న తవ్వకాలను ఆ యువకులు వీడియోలు తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడకు చేరుకున్న ఎస్ఐ వారి మొబైల్స్​ను బలవంతంగా తీసుకొని పోలీస్ స్టేషన్​కు తెచ్చారు. ఈ విషయంపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఆయన గ్రామీణ పోలీస్ స్టేషన్​కు వెళ్లి.. మొబైల్స్ ఎలా తీసుకుంటారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్రమంగా ఇసుక, మట్టి తోలుతున్నా... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోదు గానీ, అమాయకులైన ప్రజల మీద దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు. ఇద్దరు సీఐలు మంచిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కానీ, అక్రమ ఇసుక రవాణాలో ఎస్​ఐ కి భాగం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 14వ తేదీ నుంచి తానేంటో చూపిస్తానని జేసీ ప్రభాకర్​ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Last Updated : Apr 9, 2023, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details