ఆంధ్రప్రదేశ్

andhra pradesh

JC_Prabhakar_Reddy_expressed_his_anger_against_Minister

ETV Bharat / videos

JC Prabhakar Reddy Expressed his Anger Against Minister: మంత్రి పెద్దిరెడ్డి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి: జేసీ ప్రభాకర్‌ రెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2023, 4:25 PM IST

JC Prabhakar Reddy Expressed his Anger Against Minister: తాడిపత్రిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ విషయంలో రెండు రోజులుగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 120 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉన్న చోట 40 అడుగుల రోడ్డు వదిలి కళాశాల ప్రహరీ నిర్మాణానికి వైసీపీ నాయకులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిని తీవ్రంగా ఖండించారు. కనీసం 60 అడుగుల రోడ్డుకు వదిలి నిర్మించాలని డిమాండ్ చేశారు. పోలీసుల సహాయంతో వైసీపీ నాయకులు నిర్మాణం చేపట్టాలని చూశారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ అంశంపై కోర్టు సంప్రదించారు. కోర్టు నుంచి స్టే రావడంతో నిర్మాణ పనులు ప్రస్తుతానికి ఆపేశారు. అయితే,  టీడీపీ, వైసీపీ నాయకులు ప్రహరీ నిర్మాణ విషయంలో గొడవలు జరిగే అవకాశం ఉందని ముందస్తుగా రాత్రి సమయంలోనూ పోలీసులు పహారా కాస్తున్నారు. దీనిపై అనంతపురంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 

జేసీ ఆరోపణలు: తాడిపత్రిలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకోకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy  Ramachandra Reddy) దిగజారి అధికారుల ఫోన్లు చేస్తున్నారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి... కళాశాల ప్రహరీని నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్నారని చెప్పారు. గతంలో నిర్ణయించినటువంటి 50 అడుగుల రహదారిని మాస్టర్ ప్లాన్ ప్రకారం 120 అడుగుల రోడ్డుగా మార్చినట్లు ఆరోపించారు. అందుకు సంబంధించిన పరిహారం గతంలోనే చెల్లించారని జేసీ తెలిపారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (MLA Ketireddy Peddareddy) కోసం పనిచేస్తున్నారా..? తాడిపత్రి ప్రజల కోసం పనిచేస్తున్నారా..? అని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ తాడిపత్రికి వచ్చి ఏమి చేశారని, ఆయన రెండు రోజుల పర్యటన, ప్రహరీ వద్ద బందోబస్తు కోసం పోలీసులు 25 లక్షల రూపాయలు వ్యయం చేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి  గణాంకాలు వివరించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పిన మాటలు నమ్మి మంత్రి పెద్దిరెడ్డి అధికారులకు ఫోన్లు చేయటం కాదని హితవుపలికారు. వాస్తవాలేంటో  తాడిపత్రి ప్రజలను అడిగి తెలుసుకోవాలని కోరారు. కళాశాల ప్రహరీ వద్ద రహదారి మాస్టర్ ప్లాన్​ను మీడియా సమావేశంలో ప్రదర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్, ఎస్పీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details