Janasena Women wing fire on minister Amarnath మంత్రి అమర్నాథ్పై జనసేన వీరమహిళల ఆగ్రహం - పవన్ కళ్యాణ్ పై అమర్ నాథ్ విమర్శలు
Janasena Leaders Warn To Minister Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలపై జనసేన వీరమహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో వీరమహిళా యజ్ఞ శ్రీ, జనసేన నాయకులు శివప్రసాద్ మీడియా తో మాట్లాడారు. పొత్తులతో జనసేన ఎన్నికలకు వెళితే ఉలుకెందుకనీ ప్రశ్నించారు. రాజకీయ పార్టీలకు పొత్తులు కొత్త కాదు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని పవన్ కల్యాణ్ ముందే చెప్పారని మరో సారి పవన్ కళ్యాణ్ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఫలితం అనుభవిస్తారని వీరమహిళ హెచ్చరించారు. ఎప్పుడు ఏ పార్టీలో వుంటారో ఏ జెండా మోస్తారో తెలియని వాళ్ళ తో నడిపే వైసీపీ పార్టీ కి బుద్ది చెప్పే రోజు ఉందని హెచ్చరిక చేశారు. విశాఖకు ఏం చేశారో ముందు చెప్పాలని ప్రశ్నించారు. గాలిలో సీఎం వెళ్ళితే కింద చెట్లు నరికి ప్రజలు ఇబ్బంది పెట్టె స్వభావం ఉన్న సీఎం జగన్, అయన అనుచరులు పవన్ కల్యాణకోసం మాట్లాడం హాస్యాస్పదం అని అన్నారు.