ఆంధ్రప్రదేశ్

andhra pradesh

janasena_pothina_mahesh_protsest

ETV Bharat / videos

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆర్యవైశ్య ద్రోహి - సత్యనారాయణ స్వామి వ్రతాలకు అనుమతివ్వాలి : పోతిన మహేశ్​ - పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి పోతిన మహేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 4:30 PM IST

Janasena Pothina Mahesh Protsest : విజయవాడ భవానీపురం నది తీరంలో వాసవి ఫౌండేషన్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సంయుక్త అధ్వర్యంలో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతాలకు అనుమతివ్వాలని కోరుతూ జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి పోతిన మహేశ్​ నిరసన చేపట్టారు. కుమ్మరిపాలెం గుప్తా సెంటర్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలను అడ్డుకున్న వెల్లంపల్లి ఆర్యవైశ్య ద్రోహి అని ధ్వజమెత్తారు. 

ఆర్యవైశ్యులు నిర్వహించే సామూహిక సత్యనారాయణ వ్రతాలను.. పోలీసులను అడ్డం పెట్టుకుని వెల్లంపల్లి అడ్డుకుంటున్నారని మహేశ్​ ఆరోపించారు. అన్ని శాఖల అనుమతి లభించిన తర్వాత కూడా పోలీస్​ శాఖ ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో కారణం చెప్తూ.. అడ్డుకోవడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సెక్షన్​లు ఆర్యవైశ్యులు నిర్వహించే వ్రతాలకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. దీనిపై పోలీస్​ కమిషనర్​ స్పందించాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details