ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Janasena_Pawan_Kalyan_on_Nadendla_Manohar_Arrest

ETV Bharat / videos

నాదెండ్ల మనోహర్‌ అరెస్టు అప్రజాస్వామికం - విడుదల చేయకపోతే విశాఖ వచ్చి పోరాడుతా: పవన్‌కల్యాణ్‌ - విశాఖపట్నంలో జనసేన నేతల నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 3:24 PM IST

Janasena Pawan Kalyan on Nadendla Manohar Arrest: నాదెండ్ల మనోహర్ సహా జనసేన పార్టీ నాయకుల అరెస్టుపై ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. అరెస్టులు అప్రజాస్వామికమంటూ ఖండించారు. విశాఖ టైకూన్‌ జంక్షన్‌ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్‌తో పాటు, అరెస్టు చేసిన మిగతా వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసినవారిని విడుదల చేయకపోతే విశాఖకు వస్తానని హెచ్చరించారు. ఎంపీ రియల్ ఎస్టేట్‌ ప్రాజెక్టుకు వాస్తుదోషం ఉందని రోడ్డు మూసేశారని, ఇది దారుణమని పవన్ ఆక్షేపించారు.

Nadendla Manohar Arrest : విశాఖలోని ఎంపీ ఎంవీవీ నివాస సముదాయం కోసం మూసేసిన టైకూన్ కూడలి మార్గం తెరవాలని డిమాండ్​ చేస్తూ జనసేన నేతలు ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నేరుగా నిరసనకు దిగారు. ఈ పరిణామంతో విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. జనసేన నేతలు గేట్లు తోసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేసిన సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తత మధ్య జనసేన నాయకుల అరెస్టులు జరిగాయి. జనసేన నేత నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, కోన తాతారావులను అరెస్టు చేశారు. జనసేన నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీనిపై జనసేన అధినేత పవన కల్యాణ్ స్పందించారు.  

ABOUT THE AUTHOR

...view details