విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా జనసేన ర్యాలీ.. ఉత్సాహంగా పాల్గొన్న జనసైనికులు - telugudesham party news
Janasena party chief Pawan Kalyan Warahi rally: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా వారాహి వాహనంలో ర్యాలీగా బయలుదేరారు. వేలాదిమంది కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వారాహి వాహనం ఆటోనగర్‌కు చేరుకోగానే.. భారీ గజమాలతో ప్రజలు పవన్‌కు ఘన స్వాగతం పలికారు. వారహి వాహనంపై తొలిసారిగా పవన్ కల్యాణ్ విహరిస్తూ.. ప్రజలకు అభివాదం చేశారు.
మరోవైపు మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభ ఈరోజు సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. విజయవాడ నుంచి ర్యాలీగా పవన్ బయల్దేరారు. సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలాల నుంచి పార్టీ కార్యకర్తలు బస్సుల్లో, కార్లలో ఉత్సాహంగా మచిలీపట్నం సభకు హాజరయ్యారు. జనసేన సభ ప్రాంగణంలో 'జై పవర్ స్టార్, జై జనసేన, జై సీఎం' అంటూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు.