ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Janasena_Party_Meeting

ETV Bharat / videos

పవన్ నేతృత్వంలో జనసేన విస్తృత స్థాయి సమావేశం- పోరాట కార్యాచరణకు రూపకల్పన - Irregularities in AP Voter List

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 10:53 AM IST

Janasena Party Meeting: జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో జరగనుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగే సమావేశానికి పీఏసీ సభ్యులతో పాటు రాష్ట్ర కార్యవర్గ నాయకులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు హాజరుకానున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు(TDP- Janasena Alliance) నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కలిసి కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రణాళికలు రూపొందించనున్నారు. 

రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎలా సన్నద్ధత కావాలో జనసేన నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు, ఓటర్ల జాబితా అక్రమాల(Irregularities in AP Voter List) పై పోరాట కార్యాచరణ రూపొందించనున్నారు.

TDP Parliamentary Party Meeting: మరోవైపు టీడీపీ పార్లమెంటరీ సమావేశం కూడా ఈరోజు జరగనుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన అధ్యక్షతన సమావేశం జరగనుంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్లమెంట్ సమావేశంలో టీడీపీ నేతలు చర్చించనున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేలా పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details