ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Janasena_Manifesto_Committee_Meeting

ETV Bharat / videos

మేనిఫెస్టోపై జనసేన కసరత్తు - నాదెండ్ల మనోహర్ సారథ్యంలో సమావేశం - Pawan kalyan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 5:37 PM IST

Janasena Manifesto Committee Meeting: రాబోయే సాధారణ ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పనపై జనసేన కసరత్తు ప్రారంభించింది. మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ సారథ్యంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు ముత్తా శశిధర్, డి.వరప్రసాద్, డాక్టర్ కోటంరాజు శరత్, నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్న సమావేశంలో మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు. జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రంలో వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులను పరిణనలోకి తీసుకుని మ్యానిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు. 

టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగుదేశం ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రకటించినందున, ఆ అంశాలను కూడా కలిపి పూర్తి స్థాయి మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. కమిటీ సూచించిన అంశాలను పవన్ కల్యాణ్ ఆమోదించిన తర్వాత, తెలుగుదేశం నేతలతో సమావేశమై చర్చిస్తారు. రెండు పార్టీలు కలిసి సంక్రాంతి కల్లా ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.  

ABOUT THE AUTHOR

...view details